Amber Heard Musk : ట్విట్టర్ ను వీడిన మస్క్ మాజీ ప్రేయసి
అంబర్ హర్డ్ సంచలన నిర్ణయం
Amber Heard Musk : సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకే ఒక్క పేరు హాట్ టాపిక్ గా మారింది. నిత్యం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విస్తు పోయేలా చేస్తున్నారు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ . ప్రపంచ కుబేరుల్లో టాప్ లో ఉన్న మనోడు ఇటీవలే ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నాడు.
ఏకంగా రూ. 4,400 కోట్లకు భారీ డీల్ ఓకే చేసుకున్నాక అసలు సిసలైన సినిమా చూపిస్తూ వారెవ్వా మస్క్ అనేలా చేస్తున్నాడు. ఇప్పటికే సిఇఓ పరాగ్ అగర్వాల్ , సిఎఫ్ఓ సెగెల్ , లీగల్ హెడ్ విజయా గద్దెతో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్ లను సాగనంపాడు. అంతేకాదు మొత్తం 7,500 మందిలో కేవలం 2,000 మంది మాత్రమే ఉండాలని ఆదేశించాడు.
ఆ మేరకు చర్యలు ప్రారంభించాడు. ఇక ట్విట్టర్ లో పెను మార్పులకు శ్రీకారం చుట్టాడు. టిక్ మార్క్ కావాలంటే నెలకు $8 డాలర్లు చెల్లించాలని ఆదేశించాడు. శుక్రవారం ఉదయం ఈమెయిల్ ద్వారా ఆఫీసుకు బయలు దేరిన వాళ్లంతా తిరిగి తమ ఇళ్లకు వెళ్లి పోవాలని మెస్సేజ్ చేశాడు.
ఇది కలకలం రేపుతోంది. ఇక ట్విట్టర్ ఎంప్లాయిస్ కు షాక్ ల మీద షాక్ ఇస్తూ వస్తున్న ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ ఇచ్చింది మాజీ ప్రియురాలు, ప్రముఖ హాలీవుడ్ నటి అంబర్ హర్డ్(Amber Heard Musk). ఈ ముద్దుగుమ్మకు ఎనలేని పాపులారిటీ ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోట్లల్లో ఉన్నారు.
తాజాగా ఎందుకనో తన మాజీ ప్రియుడు ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ నుంచి వైదొలిగారు. దీంతో ఇప్పుడు మరోసారి వైరల్ గా మారారు అంబర్ హర్డ్. ఇది నిరసననా లేక కావాలని చేసిందా అన్నది ఆమె క్లారిటి ఇవ్వలేదు.
Also Read : రాసేందుకు హిందీ భాష సులభమైంది
