Sania Mirza : విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కామెంట్స్
Sania Mirza : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో సానియా(Sania Mirza) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సానియా మీర్జా పోస్ట్ చేసిన కామెంట్ కలకలం రేపుతోంది.
ఈ సందర్బంగా ఆమె విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి..కేవలం అల్లాహ్ ను కనుగొనేందుకు అని స్పష్టం చేసింది. దీని వెనుక సానియా మీర్జా పూర్తిగా బాధలో ఉన్నట్లు అర్థం అవుతోంది. భారత దేశంలోని హైదరాబాద్ కు చెందిన టెన్నిస్ స్టార్ ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ క్రీడాకారిణిగా పేరొందింది.
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకుందనే ప్రచారం జోరందుకుంది. టీవీ షోలలో ఒక దానిలో ఈ విషయం బట్ట బయలు అయ్యిందంటూ పాకిస్తాన్ మీడియా కోడై కూసింది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య వైవాహిక సమస్యలు ఉన్నట్లు సమాచారం.
దీంతో సానియా మీర్జా అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఆ ఇద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయన్నది ఇప్పటికి ఇంకా తెలియ రాలేదు. ఈ జంట కొంత కాలం నుంచి విడి విడిగా ఉంటున్నారని కథనాలు వచ్చాయి. కొడుకు ఇజాన్ కు మాత్రమే పేరెంట్స్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ జంట ఇటీవల దుబాయ్ లో ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టిన రోజు జరుపుకున్నారు. వాటిని మాలిక్ పంచుకున్నారు తప్పా సానియా పెట్టలేదు. అంతే కాకుండా కష్టతరమైన రోజులు ఎదుర్కొన్న క్షణాలు అంటూ మరో పోస్ట్ పెట్టింది సానియా మీర్జా.
Also Read : ట్విట్టర్ కు ప్రముఖులు గుడ్ బై