JP Nadda : మ‌ళ్లీ జైరామ్ ఠాకూరే సీఎం – జేపీ న‌డ్డా

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన బీజేపీ చీఫ్‌

JP Nadda : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా(JP Nadda) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌స్తుతం ఉన్న జైరామ్ ఠాకూర్ కు లైన్ క్లియ‌ర్ ఇచ్చారు. ఈ మేర‌కు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌న్నారు. మ‌రోసారి రాష్ట్రానికి ఎవ‌రు సీఎం అవుతార‌ని వ‌స్తున్న ప్ర‌చారంపై పుల్ స్టాప్ పెట్టారు జేపీ న‌డ్డా.

మ‌రోసారి కూడా ఆయ‌న‌కే ప‌గ్గాలు అప్ప‌గిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. శ‌నివారం జేపీ న‌డ్డా మీడియాతో మాట్లాడారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ పాల్గొన‌క పోవ‌డంపై మండిప‌డ్డారు. ఆయ‌న పార్టీకి అగ్ర నేత‌గా ఉంటూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను అవ‌మానించారంటూ ఆరోపించారు.

బీజేపీకి మ‌రోసారి అధికారాన్ని అప్ప‌గించేందుకు ప్ర‌జ‌లు రెడీగా ఉన్నార‌ని జోష్యం చెప్పారు. ప‌నిలో ప‌నిగా సోనియా, ప్రియాంక‌, రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌లు చేశారు. వారు కెరియ‌ర్ లీడ‌ర్లంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు.

ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ , గుజ‌రాత్ రాష్ట్రాల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఢోకా లేద‌ని, తాము ఆల్ రెడీ గెలుపొంద‌డం జ‌రిగింద‌న్నారు. దాని గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

అయితే ఈ రెండు రాష్ట్రాల‌లో ఎంత మెజారిటీ వ‌స్తుంద‌నే దానిపైనే నిరీక్షిస్తున్నామ‌ని చెప్పారు జేపీ న‌డ్డా(JP Nadda). హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు అభివృద్దిని కోరుకుంటున్నారు. మాయ మాట‌లు చెప్పే కాంగ్రెస్ పార్టీని న‌మ్మే స్థితిలో లేర‌న్నారు జేపీ న‌డ్డా. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : మోదీ స్టేడియం పేరు మారుస్తాం – కాంగ్రెస్

Leave A Reply

Your Email Id will not be published!