US VISA Process : యుద్ధ ప్రాతిపదికన వీసాల జారీ – యుఎస్
2023 జూన్ లోగా పూర్తయ్యేలా చర్యలు
US VISA Process : ఓ వైపు ఆర్థిక మాంద్యం, మరో వైపు అమెరికాకు వెళ్లాలని అనుకునే భారతీయులు, విద్యార్థులు, ఎన్నారైలకు తీపికబురు చెప్పింది అమెరికా. ఇప్పటికే వీసాల జారీ విషయంపై పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. తాజాగా యుఎస్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. యుద్ద ప్రాతిపదికన ఎంత వీలైత అంత త్వరగా వీసాలను(US VISA Process) జారీ చేస్తామని ప్రకటించింది.
జాతీయ భద్రతను పరిరక్షిస్తూనే యుఎస్ కు చట్టబద్దమైన ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కట్టుబడి ఉన్నామని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా వీసాల జారీ విషయంలో అత్యధికంగా అమెరికాకు భారతీయుల నుంచే అత్యధికంగా ఉన్నారని తెలిపింది.
హెచ్ -1బి , ఇతర వర్క్ పర్మిట్ వీసాలు పొందిన వారిలో అత్యధిక శాతం ఇండియన్లదేనని పేర్కొంది. భారత దేశం వంటి దేశాల నుండి వీసా దరఖాస్తుల బ్యాక్ లాగ్ పై రోజు రోజుకు ఆందోళన పెరుగుతోంది. ఇదే విషయాన్ని భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) సైతం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ కు వివరించారు.
ఆయన కూడా త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ప్రధానంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రపంచ వ్యాప్తంగా వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తోంది. ఈ ముఖ్యమైన పనిని చేసేందుకు తాము యుఎస్ ఫారిన్ సర్వీస్ సిబ్బందిని రెండింతలు చేశామని వెల్లడించింది.
వీసా ప్రాసెసింగ్ అంచనా వేసిన దానికంటే వేగంగా పుంజుకుంటుందని పేర్కొంది. కరోనా కారణంగా సిబ్బంది లేకుండా పోయారు. ప్రస్తుతం వారందరినీ పంపిస్తున్నామని ఇక జాప్యం జరగదని తెలిపింది విదేశాంగ శాఖ.
Also Read : భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం – సునక్