ICC T20 Rankings : ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో సూర్య భాయ్ టాప్

మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ..డేవాన్ కాన్వే ..బాబ‌ర్ ఆజం

ICC T20 Rankings : భార‌త స్టార్ బ్యాట‌ర్ ఇండియ‌న్ డివిలియ‌ర్స్ గా పేరొందిన సూర్య కుమార్ యాద‌వ్ అలియాస్ సూర్య భాయ్ మ‌రోసారి స‌త్తా చాటాడు. వ‌రుస‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్(ICC T20 Rankings) లో టాప్ లో నిలిచాడు.

న్యూజిలాండ్ సీరీస్ లో భాగంగా జ‌రిగిన రెండో టి20 మ్యాచ్ లో కేవ‌లం 51 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని ఏకంగా 111 ప‌రుగులు చేశాడు. దుమ్ము రేపాడు. సిక్స‌ర్లు, ఫోర్ల‌తో కీవీస్ బౌల‌ర్ల‌కు చుక్కలు చూపించాడు. అంత‌కు ముందు ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భారీగా ప‌రుగులు చేశాడు.

దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో సూర్య కుమార్ యాద‌వ్ త‌న స్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. ఇక ఎప్ప‌టి లాగే రెండో స్థానాన్ని దాయాది పాకిస్తాన్ కు చెందిన ఓపెన‌ర్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ నిలిచాడు. సూర్య కుమార్ యాద‌వ్ కు 890 పాయింట్లు ఉండ‌గా 836 పాయింట్ల‌తో రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నాడు.

ఇక మూడో ప్లేస్ లో డేవాన్ కాన్వే నిలిచాడు. 788 పాయింట్లు ద‌క్కాయి. ఇక పాకిస్తాన్ స్టార్ బ్యాట‌ర్ , కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ మూడో స్థానంతో స‌రి పెట్టుకున్నాడు.

ఆజం 778 పాయింట్లు సాధించాడు. ఇక బౌల‌ర్ విభాగం ర్యాంకింగ్స్ లో భార‌త దేశానికి చెందిన భువనేశ్వ‌ర్ క‌ముఆర్ 11వ ర్యాంక్ కు చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ వెట‌ర‌న్ ప్లేయ‌ర్ టిమ్ సౌథీ 14వ స్థానంలో నిలిచాడు.

మొత్తంగా సూర్య కుమార్ యాద‌వ్ త‌న నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని సుస్థిరం చేసుకోవ‌డంతో ఫ్యాన్స్ తెగ సంబ‌ర ప‌డి పోతున్నారు.

Also Read : ఐపీఎల్ మినీ వేలం తేదీ మార్పుపై బీసీసీఐ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!