Umran Malik Bangla Tour : బంగ్లా టూర్ కు ఉమ్రాన్ మాలిక్

ష‌మీ ప్లేస్ లో బీసీసీఐ ఎంపిక

Umran Malik Bangla Tour : బంగ్లాదేశ్ టూర్ లో ప‌ర్య‌టించే భార‌త జట్టులో ఎంపికైన పేస‌ర్ ష‌మీకి గాయం కావ‌డంతో కాశ్మీర్ స్పీడ‌ర్ ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేసిన‌ట్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్ల‌డించింది.

శిక్ష‌ణా శిబిరంలో ప్రాక్టీస్ చేస్తుండగా ష‌ఫీ భుజానికి గాయ‌మైన‌ట్లు తెలిపంది. వ‌న్డే జ‌ట్టులో ష‌మీ స్థానంలో ఉమ్రాన్(Umran Malik) ను ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

శ‌నివారం అధికారికంగా వెల్ల‌డించింది. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడి పోయింది. 10 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. డిసెంబ‌ర్ 144 నుంచి చిట్టగాంగ్ లో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సీరీస్ కు కూడా ష‌మీ దూరమ‌య్యే అవ‌కాశం ఉంది.

వ‌న్డే సీరీస్ కు ముందు శిక్ష‌ణ‌లో ష‌మీ భుజానికి గాయ‌ప‌డ‌డంతో బెంగ‌ళూరులోని ఎన్సీఏ లో బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా వెల్ల‌డించారు. బంగ్లాదేశ్ తో జ‌రిగే మూడు వ‌న్డే ల సీరీస్ కు మ‌హ్మ‌ద్ సిరాజ్ , శార్దూల్ ఠాకూర్ , దీప‌క్ చాహ‌ర్ , ఉమ్రాన్ మాలిక్ , కుల్దీప్ సేన్ పేస్ అటాక్ ఉంటుంది.

బంగ్లాలో ప‌ర్య‌టించే వ‌న్డే జ‌ట్టులో సంజూ శాంస‌న్(Sanju Samson) కు ఛాన్స్ ఇవ్వ‌లేదు. రోహిత్ శ‌ర్మ‌, కెప్టెన్ కాగా , కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ , శిఖ‌ర్ ధావ‌న్ , విరాట్ కోహ్లీ, ర‌జిత్ ప‌టీదార్ , శ్రేయ‌స్ అయ్య‌ర్, రాహుల్ త్రిపాఠి, రిష‌బ్ పంత్ , ఇషాన్ కిష‌న్ , షాబాజ్ అహ్మ‌ద్ , అక్ష‌ర్ ప‌టేల్ , వాషింగ్ట‌న్ సుంద‌ర్ , శార్దూల్ ఠాకూర్ , సిరాజ్ , చాహ‌ర్ , కుల్దీప్ సేన్ , ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

Also Read : ఆతిథ్య హ‌క్కులు తొల‌గిస్తే ఆలోచిస్తాం – పీసీబీ

Leave A Reply

Your Email Id will not be published!