IIT Students 4 Crores : ఐఐటీ స్టూడెంట్స్ బంప‌ర్ ఆఫ‌ర్స్

కోట్ల‌ల్లో వేత‌నాలు..ఆఫ‌ర్ లెట‌ర్స్

IIT Students 4 Crores : ఈ దేశం ఓ వైపు మ‌తం పేరుతో అట్టుడుకుతుంటే మ‌రో వైపు ఐఐటీల‌లో చ‌దువుకుంటున్న విద్యార్థులు మాత్రం స‌త్తా చాటుతున్నారు. అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌కు పెట్టింది ఐఐటీలు. వీటికి జీవం పోసింది మాత్రం దివంగ‌త ప్ర‌ధానులు నెహ్రూ, రాజీవ్ గాంధీ. తాజాగా ఐఐటీ స్టూడెంట్స్ కు భారీ ఎత్తున ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

కోట్ల‌ల్లో వేత‌నాలను ఆఫ‌ర్ చేశాయి దిగ్గ‌జ కంపెనీలు. ఈ ఏడాది 2022లో నిర్వ‌హించిన రిక్రూట్ మెంట్ ల‌లో భారీగా ఆఫ‌ర్లు రావ‌డం ఆశ్చ‌ర్య పోయేలా చేశాయి. ఇక ఐఐటీయ‌న్లు త‌మ రికార్డుల‌ను తామే చెరిపేస్తున్నారు. కొత్త చ‌రిత్ర‌ను లిఖిస్తున్నారు.

ఐఐటీ ఢిల్లీ, బాంబే, కాన్పూర్ కు చెందిన ముగ్గురు స్టూడెంట్స్ కు(IIT Students 4 Crores) అమెరికాకు చెందిన ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ క్యాపిట‌ల్ రూ. 4 కోట్ల వార్షిక వేత‌నం ప్ర‌క‌టించింది. ఇది ఓ రికార్డు అంటున్నారు విద్యారంగ నిపుణులు. ఈ ముగ్గురికి ఉచితంగా ప్లేస్ మెంట్ ఆఫ‌ర్స్ ఇవ్వ‌డం విశేషం.

రోజుకు ల‌క్ష రూపాయ‌లకు పైగా నెల‌కు రూ. 30 ల‌క్ష‌ల జీతం. తాజాగా ప‌లు కంపెనీలు క్యాంప‌స్ రిక్రూట్ మెంట్స్ పిలిచాయి. ఐఐటీ రూర్కెలాకు చెందిన ఓ విద్యార్థికి రూ. 1.6 కోట్లు , ఐఐటీ కాన్పూర్ కు చెందిన ఫైన‌ల్ స్టూడెంట్స్ ల‌లో ఏకంగా 519 మందికి జాబ్స్ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి.

ఇందులో ఓ స్టూడెంట్ కు అత్య‌ధికంగా రూ. 1.90 ల‌క్ష‌ల ఆఫ‌ర్ వ‌చ్చింది. ఇక 33 మందికి రూ. కోటికి పైగా ఆఫ‌ర్ లెట‌ర్లు అందుకున్నారు. మ‌రో వైపు ఐఐటీ మ‌ద్రాస్ కు చెందిన 333 మంది స్టూడెంట్స్ కు భారీగా వేత‌నాల‌తో కూడిన జాబ్స్ రావ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : సౌరాష్ట్ర విజ‌య్ హ‌జారే ఛాంపియ‌న్

Leave A Reply

Your Email Id will not be published!