Shashi Tharoor : గాయ‌ప‌డిన ఎంపీ శ‌శి థ‌రూర్

కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ట్వీట్స్

Shashi Tharoor : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ ఏది చేసినా ఓ సెన్సేష‌న్. ఆయ‌న ఏది మాట్లాడినా అది నిమిషాల్లో వైర‌ల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో శ‌శి థ‌రూర్ టాప్ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ ప‌ర్స‌న్. ఆయ‌న ప్ర‌తి అంశాన్ని ప్ర‌స్తావిస్తారు. త‌న అభిప్రాయాల‌ను నిక్క‌చ్చిగా తెలియ చేస్తారు.

తాజాగా శ‌శి థ‌రూర్ ఎడ‌మ పాదంకు గాయ‌మైంది. దీంతో పూర్తిగా ఆయ‌న బెడ్ పైనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను శ‌శి థ‌రూర్ స్వ‌యంగా పోస్ట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీకి చెందిన నాయ‌కులు, శ్రేయోభిలాషులు, నెటిజ‌న్లు స్పందించారు.

మీరు త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్ల‌తో హోరెత్తిస్తున్నారు. దీంతో తాను ఎక్క‌డికీ వెళ్ల‌లేని ప‌రిస్థితిలో ఉన్నాన‌ని పేర్కొన్నారు ఎంపీ. వారాంత‌పు నియోజ‌క‌వ‌ర్గంలో తాను ప‌ర్య‌టించాల్సి ఉంద‌ని, కానీ వాట‌న్నింటిని ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలిపారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor).

అనుకోకుండా న‌డుస్తున్న స‌మ‌యంలో ఎడ‌మ పాదం కొంచెం క‌దిలిన‌ట్ల‌యింద‌ని అందుకే వెంట‌నే ఆస్ప‌త్రికి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.

ఆయ‌న పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాల‌లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ త‌రుణంలో చూసుకోక పోవ‌డంతో మెట్ల పై నుంచి ప‌డి పోయారు. దీంతో పాదం బెణికి న‌ట్ల‌యింది. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. కాగా ఆయ‌న ఫోటోలు షేర్ చేసిన వెంట‌నే నెటిజ‌న్లు ట్వీట్ల‌తో హోరెత్తించారు. త్వ‌ర‌గా కోలుకోవాలంటూ కోరారు.

ఇదిలా ఉండ‌గా తాను కీల‌క‌మైన పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేక పోతున్నందుకు బాధ‌గా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు శ‌శి థ‌రూర్.

Also Read : కేంద్రంపై యుద్దం కిసాన్ గ‌ర్జ‌న‌కు సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!