Mahua Moitra : నెట్టింట్లో మహూవా మోయిత్రా వైరల్
ఇప్పుడు చెప్పండి పప్పు ఎవరో
Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను కడిగి పారేశారు. దేశంలో బీజేపీ వల్ల పేదలకు మరింత నష్టం చేకూరితే బడా బాబులు, వ్యాపారులు, కార్పొరేట్లకు అతి పెద్ద లాభం జరిగిందని ఆరోపించారు.
అసలు ఎవరు పప్పు అనేది మీరే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా మహూవా మోయిత్రా(Mahua Moitra) చేసిన ఎదురు దాడిని ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో ఆమె వైరల్ గా మారారు. ఆమె ఆధారాలతో సహా బట్ట బయలు చేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు పలువురు ఎంపీలు మహూవా మోయిత్రాను అభినందించారు.
ఎవరు పప్పు అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పారిశ్రామిక ఉత్పత్తి, తయారీ రంగం, భారత దేశాన్ని విడిచి పెట్టిన వారి సంఖ్యపై మహూవా ప్రశ్నలు లేవనెత్తారు. కేవలం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై దాడి చేసేందుకు బీజేపీ పప్పు అని వాడిందని అన్నారు.
కానీ ఈ పదం వాడాల్సింది దేశాన్ని ఏలుతున్న మోదీకి సరిగా సరిపోతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. అసలు పప్పు అంటే అర్థం తెలుసా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కించ పరిచేందుకు, తీవ్ర అసమర్థతతను సూచించేందుకు మాత్రమే ఉపయోగిస్తారని కానీ ఇవాళ అసలు పప్పు ఎవరో దేశానికి తెలిసి పోయిందన్నారు.
మంటను ఎవరు వెలిగించారు అనేది ప్రశ్న కాదు. కానీ ఒక వెర్రితనంతో కూడుకున్న వ్యక్తికి అగ్గిపెట్టెను ఎవరు అందించారనేది ప్రశ్న అని అన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జితేంద్ర డెహాడే అయితే తమకు మహూవా లాంటి నాయకురాళ్లు మరికొందరు కావాలన్నారు.
Also Read : హక్కులు..స్వేచ్చపై అమితాబ్ కామెంట్స్
— Mahua Moitra (@MahuaMoitra) December 13, 2022