Imran Khan Sex Call : ఇమ్రాన్ ఖాన్ ‘సెక్స్ కాల్’ క‌ల‌క‌లం

అదంతా ఫేక్ అన్న పీటీఐ పార్టీ

Imran Khan Sex Call : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఆయ‌న సెక్స్ కాల్ చేశారంటూ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తీవ్రంగా స్పందించింది ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ . ఈ ఆడియో పూర్తిగా న‌కిలీ అని పేర్కొంది.

ప్ర‌జ‌ల్లో ఇమ్రాన్ ఖాన్ కు ఉన్న ఆద‌ర‌ణ‌ను చూసి త‌ట్టుకోలేకే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయ‌కులు ఇలాంటి చ‌వ‌క‌బారు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారంటూ పీటీఐ ఆరోపించింది. ప్ర‌త్య‌ర్థుల‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డానికి స‌ర్కార్ న‌కిలీ వీడియోలు, ఆడియోల‌ను విడుద‌ల చేస్తోంద‌ని మండిప‌డింది. ద‌మ్ముంటే విచార‌ణ‌కు తాము సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఓ మహిళ‌తో స‌న్నిహితంగా మాట్లాడిన ఆడియో క్లిప్(Imran Khan Sex Call)  క‌ల‌క‌లం రేపింది. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. ఓ వైపు దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతుంటే ఈ మాజీ ప్ర‌ధాన‌మంత్రి సెక్స్ యావ‌తో ఎంజాయ్ చేస్తున్నాడంటూ ప్ర‌భుత్వ పార్టీకి చెందిన నాయ‌కులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నెల రోజుల ముందు పాకిస్తాన్ జ‌ర్న‌లిస్ట్ స‌య్య‌ద్ అలీ హైద‌ర్ యూట్యూబ్ లో షేర్ చేశారు ఆడియో క్లిప్ లు. ఇవి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి. కాగా పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి ఈ ఆడియో వెలువ‌డింద‌ని కొన్ని నివేదిక‌లు పేర్కొన్నాయి.

Also Read : ప్ర‌ధాని మోదీ వైఖ‌రి ప్ర‌శంస‌నీయం – యుఎస్

Leave A Reply

Your Email Id will not be published!