Ramiz Raja Shubh Mann Gill : శుభ్ మ‌న్ గిల్ ఆట అద్భుతం

పీసీబీ మాజీ చైర్మెన్ ర‌మీజ్ ర‌జా

Ramiz Raja Shubh Mann Gill : భార‌త క్రికెట‌ర్ల‌ను నిత్యం టార్గెట్ చేస్తూ వ‌చ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మెన్ ర‌మీజ్ ర‌జా(Ramiz Raja) ఉన్న‌ట్టుండి మాట మార్చాడు. భార‌త క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ ఆట తీరును మెచ్చుకోకుండా ఉండ‌లేక పోయాడు. త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ మేర‌కు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు ర‌మీజ్ ర‌జా. యువ ఆట‌గాడిని ఆకాశానికి ఎత్తేశాడు.

ఒక ర‌కంగా రోహిత్ శ‌ర్మ‌తో పోల్చాడు. మినీ రోహిత్ శ‌ర్మ లాగా ఆడుతున్నాడ‌ని, త‌న‌కు అలా క‌నిపిస్తున్నాడంటూ కితాబు ఇచ్చాడు ర‌మీజ్ ర‌జా. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం శుభ్ మ‌న్ గిల్ పై చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. నెట్టింట్లో ర‌మీజ్ ర‌జా కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.

పీసీబీ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి అనూహ్యంగా తొల‌గింప ప‌డ్డాక భార‌త్ , న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ల‌ను నిశితంగా ప‌రిశీలించారు ర‌మీజ్ ర‌జా. నిజానికి గిల్ ను రోహిత్ శ‌ర్మ‌కు మినీ వెర్ష‌న్ అని పేర్కొన్నాడు. త‌న స్వంత యూట్యూబ్ ఛాన‌ల్ లో శుభ్ మ‌న్ గిల్ ఆట తీరుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

రాను రాను ఓపెన‌ర్ గా రాణించే అవ‌కాశం ఉంది. ఎందుకంటే అత‌డు ఆడే విధానం చాలా ఆక‌ట్టుకునేలా ఉంద‌న్నాడు ర‌మీజ్ ర‌జా(Ramiz Raja). ఇప్ప‌టికే డ‌బుల్ సెంచ‌రీతో త‌న స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్నాడ‌ని కితాబు ఇచ్చాడు. అన్నింటికంటే కీవీస్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్న విధానం అద్భుతంగా ఉంద‌ద‌ని ప్ర‌శంసించాడు. మొత్తంగా ర‌మీజ్ ర‌జా ఇప్పుడు వైర‌ల్ గా మారాడు.

Also Read : వ‌న్డే ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!