Chikoti Praveen : నాకు సెక్యూరిటీ క‌ల్పించండి – చీకోటి

న‌న్ను చంపాల‌ని చూస్తున్నారు

Chikoti Praveen Security :  క్యాసినో వ్య‌వ‌హారంతో దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ గా మారి పోయిన చీకోటి ప్ర‌వీణ్(Chikoti Praveen) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని, కొంద‌రు రెక్కీకి పాల్ప‌డుతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బుధ‌వారం మీడియాతో మాట్లాడారు చీకోటి ప్ర‌వీణ్‌. త‌న‌ను భౌతికంగా లేకుండా చేయాల‌ని కుట్ర ప‌న్నుతున్నారంటూ ఆరోపించాడు. ఇదిలా ఉండ‌గా గోవా క్యాసినో వ్య‌వ‌హారంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ‌ను ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న క‌డ్తాల్ స‌మీపంలోని ఫామ్ హౌస్ తో పాటు హైద‌రాబాద్ లో ఉంటున్నారు. 

త‌నను అంతమొందించేందుకు కొంద‌రు ప్లాన్ చేస్తున్న‌ట్లు అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌న్నారు చీకోటి ప్ర‌వీణ్. తాను లీగ‌ల్ గా నే బిజినెస్ చేస్తున్నాన‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ప్ర‌తి దానికి లెక్క‌లు ఉన్నాయ‌ని, ఈడీ విచార‌ణ‌లో త‌న ప‌ని తాను చేసుకు పోతుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా తాను రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎప్పుడైతే ప్ర‌క‌ట‌న చేశానో ఆనాటి నుంచి త‌న‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని, త‌ను రాకుండా ఉండేందుకు కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రెక్కీ కూడా నిర్వ‌హించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇందులో భాగంగానే త‌న‌కు సెక్యూరిటీ క‌ల్పించాల‌ని రాష్ట్ర పోలీసుల‌కు లేఖ రాశాన‌ని తెలిపారు చీకోటి ప్ర‌వీణ్‌(Chikoti Praveen Security).

ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ ఇరు తెలుగు రాష్ట్రాల‌లో క‌ల‌క‌లం రేపాయి. రెక్కి నిర్వ‌హించిన దృశ్యాలు సీసీ టీవీల‌లో రికార్డ్ అయ్యాయ‌ని ఆరోపించారు.

Also Read : విమానాశ్ర‌యాలు ప్ర‌గ‌తికి దారులు – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!