DK Shiva Kumar DGP : క‌ర్ణాట‌క డీజీపీపై డీకే క‌న్నెర్ర‌

పీసీసీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

DK Shiva Kumar DGP : క‌న్న‌డ నాట రాజ‌కీయాలు మ‌రింత వేడిని పుట్టిస్తున్నాయి. అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తాజాగా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పోలీసులు అనుస‌రిస్తున్న తీరు దారుణంగా ఉందంటూ మండిప‌డ్డారు.

కర్ణాట‌క రాష్ట్ర డీజీపీపై నిప్పులు చెరిగారు. రాబోయే కాలం త‌మ‌దేన‌ని తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక సంగ‌తి తేలుస్తా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు డీకే శివ‌కుమార్. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై కక్ష సాధింపు ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ డీజీపీపై ఆరోప‌ణ‌లు చేశారు కేపీసీసీ చీఫ్‌. బీజేపీ నాయ‌కుల‌కు ర‌క్ష‌కుడిగా మారార‌ని మండిప‌డ్డారు. డీజీపీ పోస్టుకు అర్హుడు కాడ‌ని , వెంట‌నే ఆయ‌న‌ను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు డీకే శివ‌కుమార్. వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని కోర‌డం క‌ల‌క‌లం రేపింది. ఎట్టి ప‌రిస్థితుల్లో ఇక్క‌డ ఉండేందుకు వీలు లేద‌న్నారు.

డీజీపీని వెంట‌నే త‌ప్పించాల‌ని లేక పోతే ఎన్నిక‌లు స‌జావుగా సాగే ప‌రిస్థితి లేద‌న్నారు డీకే శివ‌కుమార్(DK Shiva Kumar DGP) . ఆ స్థానంలో ఆయ‌న కొలువు తీరి మూడు సంవ‌త్స‌రాలు అవుతోంది. ఇంకెన్ని సంవ‌త్స‌రాలు ఇక్క‌డ ఉంటాడ‌ని ప్ర‌శ్నించారు. కేవ‌లం త‌మ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేస్తున్నార‌ని, కేసులు న‌మోదు చేస్తున్నారంటూ ఆరోపించారు డీకే శివ‌కుమార్. ప్ర‌స్తుతం డీకే శివ‌కుమార్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : బొమ్మ‌న్..బెల్లీకు సీఎం స‌త్కారం

Leave A Reply

Your Email Id will not be published!