YS Sharmila TSPSC : అన్ని పరీక్షలను రద్దు చేయాలి – షర్మిల
వైస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్
YS Sharmila TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)లో చోటు చేసుకున్న పేపర్ లీక్ వ్యవహారం రాద్దాంతానికి దారి తీసింది. నిరుద్యోగల పక్షాన శాంతియుతంగా పోరాడుతుంటే తనను హౌస్ అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇందు కోసమేనా ఎన్నుకున్నది. తెలంగాణ పేరుతో పవర్ లోకి వచ్చిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ నియంత పాలన కొనసాగుతోందని, ఎంతో మంది బలిదానాలు చేసుకుంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరులను, కాళ్లు పోగుట్టుకున్న వారిని ఆదుకున్నారా అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల(YS Sharmila TSPSC). 10 లక్షల మంది పరీక్షలు రాస్తే పేపర్లు లీక్ అయ్యాయని, అంగట్లో సరుకులను కొనుక్కున్నట్లు పరీక్ష పేపర్లు కొనుగోలు చేసేలా చేశారని ఈ ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు 35 లక్షల మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. అన్ని పరీక్షలు లీక్ అయ్యాయని, చైర్మన్ , కార్యదర్శి, సభ్యులు కుమ్మక్కై , బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికే ఉద్యోగాలు వచ్చేలా ఇలా లీక్ చేశారంటూ ఆరోపించారు.
గత ఎనిమిదేండ్లుగా బయట పడని అక్రమాలను కూడా తేల్చాలన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఐటీకి సారథ్యం వహిస్తున్నారు. ఐటీ హబ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కాం చేస్తే ఆమెను రక్షించేందుకు ఇన్ని తిప్పలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో 4 శాతం రిజర్వేషన్ లేదు 33 శాతం కోసం పోరాడటం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు