Donald Trump Arrest : డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
అమెరికా అంతటా అలర్ట్
Donald Trump Arrest : అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. అమెరికా దేశ చరిత్రలో ఒక అధ్యక్షుడు అరెస్ట్ కావడం పెను సంచలనానికి దారి తీసింది. హష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్ ను అరెస్ట్(Donald Trump Arrest) చేశారు.
పోర్న్ స్టార్ కు అక్రమంగా డబ్బులు చెల్లించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ కేసుకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్ కు డబ్బులు చెల్లించారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు డొనాల్డ్ ట్రంప్.
ఆయనను జైలుకు తరలించారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో నేర పూరితమైన కేసులో అరెస్ట్ అయిన తొలి దేశ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మాన్ హట్టన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే ట్రంప్ బయటకు వస్తారని ఆయన తరపు న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ పై ప్రధాన ఆరోపణ ఏమిటంటే 2006లో ట్రంప్(Donald Trump) తాను ఓ ఈవెంట్ లో కలుసుకున్నామని, హోటల్ లో సెక్స్ లో పాల్గొన్నామంటూ ఆరోపణలు చేసింది పోర్న్ స్టార్ డేనియల్స్ . ఇది వెలుగులోకి రాకుండా ఉండేందుకు ట్రంప్ న్యాయవాది మైకేల్ కోహెన్ డబ్బులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
Also Read : మన దేశం నరకానికి పోతోంది – ట్రంప్