RR vs DC IPL 2023 : టాస్ గెలిచిన ఢిల్లీ రాజస్థాన్ బ్యాటింగ్
అస్సాంలోని గౌహతిలో మ్యాచ్ స్టార్
RR vs DC IPL 2023 : ఐపీఎల్ లీగ్ లో భాగంగా జరుగుతున్న 11వ మ్యాచ్ శనివారం ప్రారంభమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్(RR vs DC IPL 2023) బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటి వరకు రాజస్థాన్ రెండు మ్యాచ్ లు ఆడింది ఒకటి గెలిచింది మరొకటి ఓడి పోయింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 72 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించింది. అనంతరం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 5 రన్స్ తో ఓటమి పాలైంది.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి దాకా 2 మ్యాచ్ లు ఆడింది. రెండింటి లోనూ పరాజయం మూటగట్టుకుంది. రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ నిరాశ పరిచింది.
ఇక జట్ల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. రాజస్తాన్ జట్టులో జోస్ బట్లర్ , యశస్వి జైశ్వాల్ , సంజూ శాంసన్ (కీపర్ , కెప్టెన్ ) , రియాన్ పరాగ్ , హెట్మెయర్ , ధ్రువ్ జురెల్ , ఆర్ అశ్విన్ , జాసన్ హోల్డర్ , ట్రెంట్ బౌల్ట్ , సందీప్ శర్మ , చాహల్ ఆడతారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో డేవిడ్ వార్నర్ కెప్టెన్ , మనీష్ పాండే , రిలో రోసోవ్ , రోవ్ మన్ పావెల్ , లలిత్ యాద్ , అక్షర్ పటేల్ , అభిషేక్ పోరల్ (కీపర్ ) , అన్రిచ్ నార్టే , ఖలీల్ అహ్మద్ , కుల్దీప్ యాదవ్ , ముఖేష్ కుమార్ ఉన్నారు.
Also Read : నిరాశకు లోనైన ముద్దుగుమ్మ