DK Shiva Kumar : మార్పు తథ్యం కాంగ్రెస్ కు పట్టం – డీకే
నిప్పులు చెరిగిన కేపీసీసీ చీఫ్
DK Shiva Kumar : కర్ణాటకలో రాజకీయం మరింత వేడిని రాజేస్తోంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకు భారంగా మారిందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నరాని, తమకు పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు డీకే శివకుమార్(DK Shiva Kumar).
గతంలో ఎన్నడూ లేనంతగా అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారి పోయిందన్నారు. ధరల పెంపుదల సమస్య ఇవాళ పేద ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏం చేసిందో ఒక్కటైనా సీఎం చెప్పగలరా అని కేపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. ప్రజలకు అబద్దాలు చెప్పడం బీజేపీకి మాత్రమే చెల్లుతుందంటూ ఎద్దేవా చేశారు.
లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్న వాగ్ధానంపై కాషాయ పార్టీ నిజాయతీ లేకుండా మోసం చేస్తోందంటూ ధ్వజమెత్తారు డీకే శివకుమార్. ఐఫోన్ తయారీ యూనిట్ వస్తుందన్నారు. కానీ ఇప్పటి దాకా దాని ఊసే లేదన్నారు.
అబద్దాలను వాస్తవాలుగా నమ్మించడంలో , మతం పేరుతో భావోద్వేగాలను ఆసారగా చేసుకుని ఓట్లను చీల్చడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందన్నారు. కానీ ఈసారి సీన్ వేరేగా ఉండ బోతోందన్నారు డీకే శివకుమార్(DK Shiva Kumar).
Also Read : టైగర్ రిజర్వ్ లో మోదీ సఫారీ