GT vs CSK IPL Final 2023 : వర్షం ఆగేనా ఫైనల్ మ్యాచ్ జరిగేనా
భారీ వర్షంతో వాయిదా వేసిన అంపైర్లు
GT vs CSK IPL Final 2023 : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో అంపైర్లు చివరకు మ్యాచ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి సోమవారం ప్రారంభం అవుతుందని ప్రకటించారు. ఇవాళైనా ఫైనల్ జరుగుతుందా అనేది తేలాల్సి ఉంది. భారీగా టికెట్లు కొనుగోలు చేసి మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అనుకోకుండా వర్షం రావడంతో వారంతా హతాశులయ్యారు.
ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా గుజరాత్ టైటాన్స్(GT) గత ఏడాది ఇదే వేదికపై రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి కప్ ను కైవసం చేసుకుంది. చరిత్ర సృష్టించింది. 2015లో ఎంట్రీ ఇచ్చింది. వస్తూనే కప్ కైవసం చేసుకోవడంతో అరుదైన ఘనత సాధించింది. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో దుమ్ము రేపింది.
వరుస విజయాలతో ఆకట్టుకుంది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. మరోసారి టైటిల్ వేటకు సిద్దమవుతోంది హార్దిక్ పాండ్యా సేన.
ఇక మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK) గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరకుండానే చాప చుట్టేసింది. కానీ ఈసారి సీజన్ లో ఆరంభంలో తడబాటుకు లోనైనా ఆ తర్వాత పుంజుకుంది. గుజరాత్ ను క్వాలిఫైయర్ -1 లో ఓడించి ఖంగుతినిపించింది.
Also Read : Wrestlers Protest Comment
