Priyanka Gandhi : ఖాకీల దౌర్జన్యం ప్రియాంక ఆగ్రహం
మహిళా రెజ్లర్ల పట్ల తీరు దారుణం
Priyanka Gandhi : శాంతియుతంగా మార్చ్ నిర్వహించేందుకు ప్రయత్నించిన మహిళా రెజ్లర్లపై ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఢిల్లీ ఖాకీలు. తాము లైంగిక , శారీరక, మానసిక వేధింపులకు లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ గత ఏప్రిల్ 23 నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ ఆందోళనను శాంతియుతంగా చేపట్టాలని నిర్ణయించారు మహిళా రెజ్లర్లు. వారంతా ర్యాలీగా బయలుదేరారు.
సరిగ్గా భవనానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా పోలీసులు దాడులకు దిగారు. ఎక్కడ పడితే అక్కడ ఈడ్చుకుంటూ వెళ్లారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు. ఈ మొత్తం వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శివసేన, ఆప్ తో పాటు ఇతర పార్టీలన్నీ తీవ్రంగా ఖండించాయి. తమ అసమాన ప్రతిభా నైపుణ్యంతో పతకాలు తీసుకు వచ్చిన క్రీడాకారిణుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది అంటూ మండిపడ్డారు.
ఈ మొత్తం ఘటనపై ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) తీవ్రంగా స్పందించారు. వెంటనే దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని విధుల్లోంచి తీసి వేయాలని కోరారు. న్యాయ పరంగా తాము లైంగిక వేధింపులకు గురవుతున్నామని ఆందోళన చేపట్టారని ఇది తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. రెజ్లర్లపై దాడుల ఘటనకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టాలన్నారు.
Also Read : GT vs CSK IPL Final 2023
