Mukesh Khanna : ఆది పురుష్ టీమ్ ను కాల్చేయాలి
నటుడు ముఖేష్ ఖన్నా కామెంట్స్
Mukesh Khanna : ఓం రౌత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ , ముద్దుగుమ్మ కృతీ సనన్ కలిసి నటించిన ఆది పురుష్ పై ఇంకా వివాదాలు వీడడం లేదు. విమర్శలు కుప్పలు తెప్పలుగా వస్తూనే ఉన్నాయి. భారత దేశానికి చెందిన ఇతిహాసాలకు వక్ర భాష్యం చెప్పే హక్కు లేదంటూ నిప్పులు చెరిగారు ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా. ఆయన ఏకంగా ఆది పురుష్ టీమ్ ను కాల్చి వేయాలని డిమాండ్ చేశారు.
సినిమా పూర్తిగా పక్కదారి పట్టిందన్నారు. వాడిన డైలాగులు, క్యాస్టూమ్స్ పూర్తిగా విరుద్దంగా ఉన్నాయని ఆరోపించారు. దర్శకుడు, నటించిన ప్రతి ఒక్కరినీ ఎవరు కూడా క్షమించ కూడదన్నారు. ఈ టీమ్ మొత్తాన్ని 50 డిగ్రీల సెల్సియస్ లో నిల్చొని కాల్చి వేయాలని తన ఛానెల్ లో ప్రకటించాడు ముఖేష్ ఖన్నా(Mukesh Khanna).
రామాయణంతో ఇది భయంకరమైన జోక్ అని ఎద్దేవా చేశాడు. మన గ్రంథాలను అవమానించే హక్కు ఎవరికైనా ఎవరు ఇచ్చారంటూ నిప్పులు చెరిగాడు నటుడు. ముఖేష్ ఖన్నాతో పాటు అరుణ్ గోవిల్ , విక్రమ్ మస్టల్ కూడా ఈ చిత్రంపై విరుచుకు పడ్డారు. స్క్రిప్టు పూర్తిగా బద్ద విరుద్దంగా ఉందన్నారు. ఆది పురుష్ భారతీయ సినిమా కాదని ఇది ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నాడు ముఖేష్ ఖన్నా.
ఇదిలా ఉండగా నటుడు ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ప్రత్యేకించి దర్శకుడు ఓం రౌత్ ను ఏకిపారేసిన తీరు ఇప్పుడు చర్చకు దారి తీసేలా చేసింది.
Also Read : Malli Pelli Aha : 23న ఆహాలో మళ్లీ పెళ్లి