Koyil Alwar Tirumanjanam : కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీనివాసమంగాపురంలో వేడుక
Koyil Alwar Tirumanjanam : శ్రీినివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 24 నుండి 26వ తేదీ వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా వేడుకగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొల్పారు. తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి, తదితర అన్ని వస్తువులను నీళ్లతో శుద్ది చేశారు.
అనంతరం నామ కోపు, శ్రీ చూర్ణం , కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ, తదితర సుగుంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉండగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koyil Alwar Tirumanjanam) సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు.
ఇక సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా జూన్ 24న పెద్ద శేష వాహనం, జూన్ 25న హనుమంత వాహనం, జూన్ 26న గరుడ వాహనంపై స్వామి వారు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తారు. భక్తులను కటాక్షించనున్నారు. తిరుపతికి చెందిన భక్తుడు శ్రీ నరసింహులు స్వామి వారికి రూ. 18 వేలు విలువ కలిగిన కురాళాలు, పరదాలు విరాళంగా అందజేశారు.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుపతికి చెందిన భక్తుడు శ్రీ నరసింహులు స్వామివారికి రూ.18 వేలు విలువగల కురాళాలు, పరదాలు విరాళంగా అందించారు.
Also Read : Anil Ambani VS Elon Musk : అంబానీ మస్క్ బిగ్ ఫైట్
