Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. యువ గళం పాదయాత్ర ప్రస్తుతం ఏపీలో కొనసాగుతోంది. గూడూరు నియోజకవర్గంలో యువ గళం సారథి పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జెట్ స్పీడ్ తో 1,800 కిలోమీటర్లు కొనసాగింది యువ గళం యాత్ర. ఇదిలా ఉండగా ఆక్వా రైతులకు ప్రోత్సాహకాల హామీతో శిలా ఫలకం ఆవిష్కరించారు నారా లోకేష్.
ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. గూడురు నియోజకవర్గం చిట్టమూరు మండలం అరవపాలెం వద్ద మంగళవారం యాత్ర పందెనిమిది వందల కిలోమీటర్లు పూర్తయింది.
అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతులకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్(Nara Lokesh). వైసీపీ పాలనలో కుదేలైన ఆక్వా రంగానికి తాము అందించ బోయే ప్రోత్సాహకాలు అందజేస్తామని చెప్పారు నారా లోకేష్.
ప్రశ్నించే వాళ్లను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేస్తూ, అరెస్ట్ లు చేస్తున్నాంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : CM KCR : ఏ పార్టీకి మేం బి టీమ్ కాదు – కేసీఆర్
