PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. కూతురు సంక్షేమం కావాలా లేక మీ బంధువుల సంక్షేమం కావాలా అని ప్రశ్నించారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో దేశంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.
తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం మోసానికి, అవినీతి, అక్రమాలకు పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు నరేంద్ర మోదీ. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కసీఆర్ కే దక్కుతందంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు ఛీత్కరించడం ఖాయమని జోష్యం చెప్పారు నరేంద్ర మోదీ.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఖాయమని ఆ విషయం తమకు స్పష్టమైందన్నారు. భారత రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని చూస్తున్నారంటూ చెప్పారు నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi).
ఇదిలా ఉండగా తెలంగాణలో పెద్ద ఎత్తున బీజేపీ పాగా వేయాలని అనుకుంటోంది. కానీ ఆ పార్టీ ఆరోపణలు చేయడం తప్పా ఆచరణలో పెట్టడం లేదని మండిపడుతున్నారు జనం. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయకుండా వదిలి పెట్టారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి మాత్రం బీజేపీ సమాధానం ఇవ్వడం లేదు.
Also Read : Nara Lokesh : జగన్ పాలనలో ఆగమాగం
