YCP Support Centre : కేంద్రం బిల్లులకు వైసీపీ ఎంపీల మద్దతు
ఢిల్లీని నియంత్రించే బిల్లు ఓకే అవుతుందా
YCP Support Centre : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్ లోని లోక్ సభ , రాజ్య సభలో ప్రవేశ పెట్టే మోదీ భారతీయ జనతా పార్టీ(BJP) , సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశ పెట్టే అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ మేరకు సీఎం తాము సపోర్ట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ పార్టీకి లోక్ సభలో 22 మంది ఎంపీలు ఉండగా రాజ్యసభలో 9 మంది సభ్యులు కలిగి ఉన్నారు.
YCP Support Centre Bills
గతంలో కూడా వైసీపీ ఎంపీలు, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర బిల్లులకు మద్దతు తెలియ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం కీలకమైన బిల్లు సభలో ప్రవేశ పెట్టనుంది కేంద్రం. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు ఈ బిల్లును తయారు చేసింది. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లా అండ్ ఆర్డర్ తప్ప ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎలాంటి అధికారాలు ఉండవని పేర్కొంది.
ఒక రకంగా కేంద్రానికి చెంప పెట్టు ఈ తీర్పు. అయినా భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్ చేస్తూ కేంద్రం మంకుపట్టు ధోరణి ప్రదర్శిస్తోంది. ఢిల్లీ సర్కార్ పై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు లేక పోలేదు. లోక్ సభలో కేంద్రానికి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సరిపోదు. వైసీపీ సపోర్ట్ తో బిల్లు పాస్ అవుతుందా లేక వీగి పోతుందా అన్నది చూడాలి.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు
