M Hari Krishna : బౌద్ధం ప్రాతః స్మరణీయం – హరికృష్ణ
న్యూయార్క్ లో బౌద్ధ కళా ప్రదర్శనకు హాజరు
M Hari Krishna : తరాలు గడిచినా బుద్దుడు ప్రభావం తగ్గలేదని అన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ ఎం. హరికృష్ణ. న్యూయార్క్ లోని ది మెట్ మ్యూజియంలో నిర్వహించిన ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ ఎగ్జిబిషన్ లో భారత దేశానికి చెందిన 140 వస్తువులను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఎం. హరికృష్ణ(M Hari Krishna) ప్రసంగించారు.
M Hari Krishna Words
ఏపీ సీఎం తరపున శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశం మత పరమైన వైవిద్యానికి పేరు పొందిందన్నారు. బుద్దుని బోధనలు మత పరమైన మార్గాలను దాటి బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేశాయన్నారు. శాంతి, సంతృప్తితో కూడిన అర్థవంతమైన జీవితాలను గడిపేందుకు ప్రేరేపించాయని కొనియాడారు ఎం. హరికృష్ణ.
బుద్దుని సూత్రాలు అశోకుడు యుద్దం చేయకుండా ఉండేలా చేశాయన్నారు. ఆయన ప్రభావం నాటి గాంధీపై పడ్డాయని చెప్పారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, బేయార్డ్ రస్టిన్ లతో సహా అమెరికన్ పౌర హక్కుల కార్యకర్తలకు బుద్దుడు స్పూర్తిగా నిలిచాడని చెప్పారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ పై యుద్దం ఆపాలని కోరారు హరికృష్ణ. బుద్దుడి వారసత్వాన్ని కొనసాగిస్తున్న దలైలామాను గుర్తు చేశారు.
బౌద్ద మతం విపస్యనను ప్రేరేపించిందని అన్నారు హరికృష్ణ. భారత దేశం నుండి అత్యంత విజయవంతమైన సాంస్కృతిక ఎగుమతి అని పేర్కొన్నారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు ఈ రెండింటినీ ఆచరించాలని సూచించారు. 125 అడుగుల ధ్యాన బుద్ద విగ్రహాన్ని అమరావతిలో నిర్మించారని గుర్తు చేశారు హరికృష్ణ.
Also Read : AP CM YS Jagan : 357 మంది విద్యార్థులకు రూ. 45.53 కోట్లు
