Vasanth Ravi Rajinikanth : సార్ మీతో ప్ర‌యాణం అద్భుతం

ర‌జ‌నీకాంత్ పై వ‌సంత్ ర‌వి కామెంట్

Vasanth Ravi Rajinikanth : త‌లైవా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ , త‌మ‌న్నా భాటియా క‌లిసి న‌టించిన జైల‌ర్(Jailer) దుమ్ము రేపుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై భారీ జ‌నాద‌ర‌ణ‌ను చూర‌గొంటోంది. ఈ సంద‌ర్బంగా న‌టుడు వ‌సంత్ ర‌వి(Vasanth Ravi) ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న సంతోషాన్ని పంచుకున్నారు.

Vasanth Ravi Rajinikanth Memories

త‌న సినీ కెరీర్ లో మ‌రిచి పోని సంఘ‌ట‌న ఏదైనా ఉందంటే అది ర‌జ‌నీ స‌ర్ తో క‌లిసి న‌టించ‌డం. ఆయ‌న‌తో గ‌డిపిన ప్ర‌తి క్ష‌ణం ఎల్ల‌ప్ప‌టికీ నిలిచి పోతుంద‌ని పేర్కొన్నాడు వ‌సంత్ ర‌వి. సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఇన్నేళ్లుగా తాను పెంపొందించుకున్న సంపూర్ణ అంకిత భావం, ఓర్పు, నిబ‌ద్ద‌త‌, సంక‌ల్పం ఈ సినిమాలో ఇమిడి ఉన్నాయ‌ని తెలిపాడు వసంత్ ర‌వి.

అంతే కాదు అనుభ‌వాల‌తో కూడిన ఆరేళ్ల ప్ర‌యాణం సినిమా రంగంలో త‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచింద‌న్నారు. ఆగ‌స్టు 10 నుండి విల‌క్ష‌ణ‌మైన ర‌జ‌నీకాంత్ సార్ కొడుకు అర్జున్ ముత్తువేల్ పాండియ‌న్ పాత్ర‌లో అడుగు పెడుతున్నాన‌ని వెల్ల‌డించాడు. సెట్ లో మీ బోధ‌న‌లు నా నట‌నా నైపుణ్యాల‌ను మాత్ర‌మే కాకుండా మాన‌వ‌త్వం, జీవితంపై నా అవ‌గాహ‌న‌ను కూడా మెరుగు ప‌రిచాయ‌ని కొనియాడారు వ‌సంత్ ర‌వి.

Also Read : AP Govt Denied : ఏపీ స‌ర్కార్ పై ప్ర‌చారం అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!