AP Govt Denied : ఏపీ సర్కార్ పై ప్రచారం అబద్దం
సరైన పత్రాలు దాఖలు చేయలేదు
AP Govt Denied : మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. టికెట్ల ధరల పెంపునకు సంబంధించి వివిధ మీడియా సంస్థల్లో, సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేకంగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. రూల్స్ ప్రకారం డాక్యుమెంట్లు, పత్రాలను జత చేసి ప్రత్యేక టికెట్ రేట్లు పొందాల్సి ఉంటుంది. అదేదీ ఈ సినిమా విషయంలో సమర్పించ లేదు. అందుకే ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చిందని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది.
AP Govt Denied Viral
గతంలో ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు పత్రాలు సమర్పించి పర్మిషన్ పొందారని తెలిపింది సర్కార్. కానీ భోళా శంకర్(Bhola Shankar) సినిమా విషయానికి వచ్చే సరికల్లా సదరు నిర్మాణ సంస్థ ఇప్పటి వరకు ఏపీ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అడిగిన ముఖ్యమైన పత్రాలు ఏవీ ఇవ్వలేదని వెల్లడించింది. ఈ కారణం వల్లనే ఆ సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. ఇందులో ప్రభుత్వ జోక్యం లేనే లేదని కుండ బద్దలు కొట్టింది.
హీరో , హీరోయిన్ , డైరెక్టర్ పారితోషకాలు కాకుండా సినిమా నిర్మాణ ఖర్చు ప్రొడక్షన్ , పోస్ట్ ప్రొడక్షన్ కలిపి రూ. 100 కోట్లు దాటితే ప్రత్యేక రేట్లను అనుమతి ఇస్తూ రాష్ట్ర సర్కార్ ఏప్రిల్ 11, 2022న మెమో జారీ చేసిందని తెలిపింది.
Also Read : CEC Bill CJI Comment : సీజేఐ లేకుండానే సీఈసీ ఎంపిక
