CEC Bill CJI Comment : సీజేఐ లేకుండానే సీఈసీ ఎంపిక

మోదీ చ‌క్రం సీజేఐకి మంగ‌ళం

CEC Bill CJI Comment  : కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ స‌కీర్ణ స‌ర్కార్ కు కంట్లో న‌లుసుగా మారిన భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై ధ‌నంజ‌య చంద్రచూడ్(CJI Chandra Chud) ను అవ‌మానించేలా ఇవాళ పార్ల‌మెంట్ లో సీఈసీ బిల్లు ఆమోదం పొందింది. భార‌త దేశ ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించే బాధ్య‌త కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఉంటుంది. కేవ‌లం ఎన్నిక‌ల‌ప్పుడు మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చే సీఈసీ ఆ త‌ర్వాత త‌న ప్రాధాన్య‌త కోల్పోతూ వ‌స్తోంది. దీనికి స‌వాల‌క్ష కార‌ణాలు ఉన్నాయి. దీనిని గ‌మ‌నించే తాజాగా సీజేఐగా ఉన్న చంద్ర‌చూడ్ మోదీ ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు ఇటీవ‌ల.

ఆగ‌మేఘాల మీద మోదీ ప్ర‌భుత్వం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను నియ‌మించింది. దీనిని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన కేసులో సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఒక ర‌కంగా చెప్పాలంటే బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ కు చెంప ఛెళ్లుమ‌నిపించింది. స్వ‌చ్చంధ ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌డం, ఆ వెంట‌నే కేంద్రం సీఈసీగా సిఫార‌సు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఆపై కేంద్రంపై మండి ప‌డింది. తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని స్ప‌ష్టం చేసింది.

CEC Bill CJI Comment Viral

ఒక ర‌కంగా హెచ్చ‌రించింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ స‌ర్వ స్వతంత్రుడై ఉండాల‌ని, ఎవ‌రి ప‌క్షం వ‌హించే వ్య‌క్తిగా ఉండ కూడాద‌ని పేర్కొంది. అంతే కాదు వీలైతే సీఈసీ ప్ర‌ధాన మంత్రిని, దేశపు ప్ర‌థ‌మ పౌరుడిని నిల‌దీసే విధంగా ఉండాల‌ని స్ప‌ష్టమైన తీర్పు చెప్పింది. అయ్యా ఎస్ అనే రీతిలో ఉండ కూడ‌ద‌ని హెచ్చ‌రించింది. ఈ సంద‌ర్బంగా సీజేఐ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం కీల‌క‌మైన ప్ర‌తిపాద‌న చేసింది. దేశ ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ తో పాటు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను ప్ర‌ధాన మంత్రి, సీజేఐ(CJI), ప్ర‌తిప‌క్ష నాయ‌కుడితో ఎంపిక క‌మిటి ఉండాల‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో మోదీ , అమిత్ షా ద్వ‌యం మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డారు. ఇప్ప‌టికే మోదీ చేతిలో సీఈసీ బందీ అయ్యింద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. ఈ త‌రుణంలో ఎలాగైనా స‌రే సీజేఐ గ‌నుక ఉంటే ఎంపిక క‌మిటీలో త‌మ ప‌ప్పులు ఉడ‌క‌వ‌ని ఆలోచించారు. జ‌స్టిస్ చంద్ర‌చూడ్ లేకుండానే సీఈసీ, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను ఎంపిక చేసేందుకు సంబంధించి బిల్లును రూపొందించారు.

ఈ మేర‌కు పార్ల‌మెంట్ లో బిల్లును ప్ర‌వేశ పెట్టారు. తీవ్ర గంద‌ర గోళం మ‌ధ్య ఆమోదం పొందింది. కానీ మోదీ త‌న పంతాన్ని నెగ్గించుకున్నారు. త‌న నిర్ణ‌యాల‌ను ఏకి పారేస్తూ ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యారైన సీజేఐని(CJI) కావాల‌ని త‌ప్పించారు. తాజాగా బిల్లులో ప్ర‌ధాన మంత్రి, లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, కేబినెట్ లో ఎవ‌రో ఒక‌రు మంత్రి మాత్ర‌మే ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డారు. కావాల‌ని సీజేఐని ప‌క్క‌న పెట్టారు. దీనిపై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని గొంతు చించుకున్నాయి. ఎందుకంటే 2024లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకు ఇప్ప‌టి నుంచే ఆయ‌న త‌న ప్లాన్ ను అమ‌లు చేసుకుంటూ వెళుతున్నారు. మొత్తంగా తన పంతాన్ని మోదీ నెగ్గించుకున్నారు. కానీ కాలం ఎప్ప‌టికీ ఒకేలా ఉండ‌దు. ఒక్కోసారి అది తిరిగి ప్ర‌శ్నిస్తుంది. నిల‌దీస్తుంది. ప్ర‌జా బోనులో నిల‌బెడుతుంది. ఇందుకు ఎవ‌రూ మిన‌హాయింపు కాద‌ని తెలుసు కోవాలి. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Also Read : BJP Janasena Dharna : పంచాయ‌తీల నిధులు దారి మ‌ళ్లింపు

Leave A Reply

Your Email Id will not be published!