BJP Janasena Dharna : పంచాయ‌తీల నిధులు దారి మ‌ళ్లింపు

నిప్పులు చెరిగిన పురందేశ్వ‌రి

BJP Janasena Dharna : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయ‌తీల నిధులు దారి మ‌ళ్లించార‌ని, కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌డం లేదంటూ గురువారం భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP), ఏపీ జ‌న‌సేన పార్టీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు. జ‌గ‌న్ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ ల వ‌ద్ద నిర‌స‌నకు దిగారు. ప‌లు చోట్ల బీజేపీ, జ‌న‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.

BJP Janasena Dharna for Contractors

ఇక ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి. ఒంగోలు జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద జ‌రిగిన ఆందోళ‌న‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం మంజూరు చేసిన నిధుల‌ను కావాల‌ని ప‌క్క‌దారి ప‌ట్టించింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింద‌న్నారు. కానీ జ‌గ‌న్ రెడ్డి ఇష్టానుసారం నిధుల‌ను ఇత‌ర ప‌థ‌కాల‌కు ఉప‌యోగించారంటూ ఆరోపించారు పురందేశ్వ‌రి. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ కు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఆధ్వ‌ర్యంలో మెమోరాండం స‌మ‌ర్పించారు.

Also Read : CEC Bill : సీఇసీ బిల్లుకు ఆమోదం

Leave A Reply

Your Email Id will not be published!