KC Venugopal : కాంగ్రెస్ స‌భ ఏర్పాట్ల‌పై కేసీ ఆరా

ప‌రిశీలించిన ఠాక్రే..రేవంత్ రెడ్డి

KC Venugopal : హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 17న భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల‌ను ఎంపిక చేశారు. ఈ సంద‌ర్భంగా ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్(KC Venugopal) హైద‌రాబాద్ కు విచ్చేశారు.

KC Venugopal came to Hyderabad

ఆయ‌న రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో క‌లిసి స‌భ‌కు సంబంధించి ఎక్క‌డ నిర్వ‌హించాల‌నే దానిపై ప‌రిశీలించారు. ఈ మేర‌కు పార్టీ ప‌రంగా ఏర్పాట్ల‌లో మునిగి పోయింది. త్వ‌ర‌లో రాష్ట్రంలో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

క‌ర్ణాట‌క‌లో బీజేపీని ఓడించి హ‌స్తం ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. దీంతో ప‌క్క‌నే ఉన్న తెలంగాణ‌లో జోష్ పెరిగింది. ఇక్క‌డ కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త ఉంద‌ని ఈ త‌రుణంలో త‌మ పార్టీకి ఛాన్స్ ఉంద‌ని భావిస్తోంది.

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా వ‌చ్చాక కొంత స్త‌బ్దుగా ఉన్న పార్టీలో కొత్త చైత‌న్యం వ‌చ్చింది. అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని పోయేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎలాగైనా స‌రే బీఆర్ఎస్ ను గ‌ద్దె దించాల‌ని , తాను సీఎం కావాల‌ని క‌ల‌లు కంటున్నారు రేవంత్ రెడ్డి. ఆ దిశ‌గా పావులు క‌దుపుతున్నారు. మొత్తంగా స‌భను న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో నిర్వ‌హించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు.

Also Read : Rahul Gandhi Bharat Jodo Yatra : భార‌త్ జోడో యాత్ర‌కు ఏడాది

Leave A Reply

Your Email Id will not be published!