Pawan Kalyan : ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ – పవన్
జనసేన పార్టీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan : మంగళగిరి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గతి తప్పిందని, ప్రజలు బతికే పరిస్థితులు లేవన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొందని మండిపడ్డారు. చీకటి రోజులు కొనసాగుతున్నాయని ఆవేదన చెందారు.
Pawan Kalyan Comment
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను ఓ నియంతనని అనుకుంటున్నాడని కానీ ప్రజాస్వామ్యంలో ఇది చెల్లుబాటు కాదన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). నేను జైలుకు వెళ్లాను..ప్రతిపక్ష నాయకులు కూడా జైలుకు వెళ్లాలని అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
చట్టాలు గనుక సంపూర్ణంగా పని చేసి ఉండి ఉంటే ఇవాళ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయి ఉండేవాడు కాదన్నారు పవన్ కళ్యాణ్. వారాహి యాత్ర వేళ కోనసీమ జిల్లాలో మారణకాండ సృష్టించేందుకు 2 వేల మంది కిరాయి మూకలను దించారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ కు వెళ్లినప్పడుల్లా రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతుందన్నారు. దేశంలో జి20 సమావేశం జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు అరెస్ట్ కు జగన్ స్కెచ్ వేశాడని ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్.
Also Read : Ambati Rambabu : చంద్రబాబు జీవితం అవినీతిమయం
