కృష్ణా జిల్లా : ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని జులై 10వ తేదీ నుంచి ప్రారంభిస్తాం అని ప్రకటించారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. సర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం అన్నారు. సర్ ప్రక్రియపై అలసత్యం వద్దు, ప్రతిఓటు విలువైనది. అవనిగడ్డలో కమిటీలు పెండింగ్ లో ఉన్నాయి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. కొన్ని విషయాల్లో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది, 24 గంటల్లో సరి చేయాలని ఆదేశించాం. దొంగ కేసులను సహించబోను. మంత్రి, జోనల్ కోఆర్డినేటర్ తో మాట్లాడాను. కార్యకర్తలను కాపాడు కోవాల్సిన బాధ్యత నాపై ఉంది. త్వరలో నియోజకవర్గానికి అందరికీ ఆమోద యోగ్యమైన ఇన్ చార్జిని వేస్తానని ప్రకటించారు లోకేష్.
కూటమి అనేది దీర్ఘకాలంగా కొనసాగాలి, సమస్యలు పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటాం, నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు. అంతా కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలి అన్నారు . ఎంత బాగా పనిచేసినా 1989లో అన్నను ఓడించారు, బాబుని కూడా పలుమార్లు ఓడించారు, కియా తెచ్చిన చోట ఓడిపోయాం. ఇప్పుడు టిడిపి 3.0 నడుస్తోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వారితో మమేకం కావాలి. అధికారంలోకి వచ్చామన్న అహంకారం వీడాలి. కలసికట్టుగా పని చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు, ఇది మర్చిపోవద్దు. అందరం టిడిపి దేవాలయానికే రావాలి, అది మర్చి పోవద్దు. ఈ సమావేశంలో కృష్ణాజిల్లా ఇన్ చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, సిఎంఓ కార్యక్రమాల సమన్వయకర్త, జోనల్ ఇన్చార్జి సత్యనారాయణరాజు పాల్గొన్నారు.
