బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ గుర్తింపు టీడీపీతోనే

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగిన ఎస్. స‌విత

విజయవాడ : సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, బీసీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నింటా ముందంజలో నిలబెట్టేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు తెలిపారు. గౌతు లచ్చన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. బీసీలను జగన్ వేధిస్తే, సీఎం చంద్రబాబు అక్కున చేర్చుకున్నారన్నారు. గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లా బారువా గ్రామంలో సామాన్య గౌడు కుటుంబంలో జన్మించారన్నారు. అణగారిన వర్గాలు, బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం తుది శ్వాస విడిచిపెట్టే వరకూ పోరాటం చేశారన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా బీసీలు, రైతులు, శ్రామికుల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.. గౌతు లచ్చన్న ఆశయాల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. అన్న ఎన్టీఆర్ బీసీల అభ్యున్నతి కోసం టీడీపీని స్థాపించారన్నారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నాయన్నారు.

విద్యతోనే బీసీలు అభివృద్ధి చెందుతారని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని అన్నారు. అందుకే, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేస్తున్నారన్నారు. గౌతు లచ్చన్న జయంతిని జరగకుండా జగన్ తన హయాంలో అడ్డంకులు సృష్టించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేలా గతేడాది జీవో జారీ చేశామన్నారు. గౌతు లచ్చన్న పోరాట స్పూర్తి, ప్రజా సేవ, దేశభక్తి నేటి తరం యువతకు ఎంతో ఆదర్శమన్నారు. దేశానికి, వెనుబడిన వర్గాల అభ్యున్నతికి గౌతు లచ్చన్న చేసిన సేవలు భావితరాలకు తెలియ జేయాలన్న సంకల్పంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. మద్యం షాపుల్లో గీత కార్మికులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించి వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీలేనని మంత్రి సవిత తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!