సీజేఐ, బీసీఐ చైర్మ‌న్ల రాక‌ను ఒప్పుకునేది లేదు

న‌ల్సార్ వీసీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టూడెంట్స్

హైదరాబాద్ : న‌ల్సార్ లో జ‌రిగే స్నాత‌కోత్స‌వ కార్య‌క్ర‌మానికి సీజేఐ సూర్య‌కంత్ తో పాటు బీసీఐ చైర్మ‌న్ ల‌ను ఆహ్వానించ‌డాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు న‌ల్సార్ విద్యార్థులు. ఈ మేర‌కు వారు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ దేశంలో నిరుద్యోగులు, యువ‌త‌, విద్యార్థుల‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బొద్దింక‌లు అంటూ పేర్కొన‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా డిమాండ్ చేశారు. కాగా విద్యార్థుల‌పై బీసీఐ తీసుకున్న చ‌ర్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంది. వారిని ఆహ్వానించ‌డం పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు. తమ వార్షిక స్నాతకోత్సవానికి జ‌స్టిస్ సూర్య కాంత్ , బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాలను ఆహ్వానించడాన్ని వ్యతిరేకించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ న్యాయ విద్యా సంస్థ అయిన న‌ల్సార్ విద్యార్థులు బీసీఐ చైర్మన్ , సీజేఐ తో విభేదాలు ఎదుర్కొంటున్న తరుణంలోనే న‌ల్సార్ విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘

భావప్రకటనా స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును ఉల్లంఘించే ప్రయత్నం చేసినందుకు గాను విద్యార్థులు , అధ్యాపక వర్గానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బేషరతుగా క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అధికారిక లెటర్-హెడ్‌ను ఉపయోగించడానికి సంబంధించిన విధానం ఏమిటో వివరించాలని వారు బీసీఐని కోరారు. విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ, తమ బ్యాచ్ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్య కాంత్ హాజరు కావడం పట్ల విద్యార్థులు తమ ‘తీవ్ర అసమ్మతిని’ వ్యక్తం చేశారు. మిశ్రా తన ‘ప్రవర్తనకు బాధ్యత’ వహించే వరకు తమ స్నాతకోత్సవానికి హాజరు కావడాన్ని కూడా వారు వ్యతిరేకించారు.

Leave A Reply

Your Email Id will not be published!