Etela Jamuna : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీలో టికెట్లు దరఖాస్తు చేసుకునే సమయం ముగిసింది. భారీ ఎత్తున దరఖాస్తులు రావడం విశేషం. హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender) సతీమణి ఈటల జమున సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
Etela Jamuna Ready to contest against KCR
విచిత్రం ఏమిటంటే ఆమెదరఖాస్తు చేసుకున్న నియోజకవర్గం బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ బరిలో నిలిచే మెదక్ ఉమ్మడి జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి. తన భర్తను ముప్పు తిప్పలు పెట్టిన సీఎంను ఓడించడమే తన ముందున్న లక్ష్యమని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం తన పంతాన్ని నెగ్గించుకునేందుకు రెడీ అయ్యారు.
ఇందులో భాగంగానే తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 10 గడువు విధించింది. దీంతో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బరిలో నిలిచేందుకు పోటీ పడ్డారు. దరఖాస్తులు చేసుకున్నారు. తాత్కాలిక సమాచారం మేరకు 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు టాక్.
ఇప్పటి దాకా 6,003 దరఖాస్తులు రాగా చివరి రోజు 2,780 దరఖాస్తులు రావడం విస్తు పోయేలా చేసింది. విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తు చేసుకోవాలంటే ఫీజు నిర్ణయించారు. కానీ బీజేపీలో ఎలాంటి ఫీజు లేక పోవడంతో భారీ ఎత్తున దరఖాస్తులు అందాయి.
Also Read : Perni Nani : సరైనోడి చేతికి చంద్రబాబు చిక్కారు
