Hyderabad Super : హైద‌రాబాద్ సోలార్ రూఫ్ సూప‌ర్

గ్రీన్ బెల్ట్ అండ్ రోడ్ చీఫ్ ఎరిక్ సోల్హీమ్

Hyderabad Super : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు పొందుతున్నాయి. ఐటీ, పుర‌పాల‌క‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ సార‌థ్యంలో భాగ్య న‌గ‌రంలో ప‌లు ప‌నులు చేప‌ట్టారు.

న‌గ‌ర వాసుల‌కు అందుబాటులో ఉండేలా వ‌స‌తి సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవ‌ల ఫ్లై ఓవ‌ర్స్ తో పాటు సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ను నిర్మించారు. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

Hyderabad Super Said BRI President

తాజాగా వ‌ర‌ల్డ్ లోనే పేరు పొందిన సంస్థ గ్రీన్ బెల్డ్ అండ్ రోడ్ ఇన్ స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఎరిక్ సోల్హీమ్(Erik Solheim) హైద‌రాబాద్ ను సంద‌ర్శించారు. ఈ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. తాను ఎన్నో దేశాలు తిరిగాన‌ని, కానీ ఇలాంటి రూఫ్ త‌న‌ను ఆక‌ట్టు కోలేద‌ని పేర్కొన్నారు.

ఆదివారం ఎరిక్ సోల్హీమ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఈ మేర‌కు తాను సైక్లింగ్ చేస్తూ సోలార్ రూఫ్ ద్వారా తీసుకున్న ఫోటోల‌ను షేర్ చేశారు. ప్ర‌స్తుతం అవి నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. ఈ సంద‌ర్బంగా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని, ప్ర‌త్యేకించి మంత్రి కేటీఆర్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

Also Read : Varahi Yatra : 21 నుంచి ప‌వ‌న వారాహి యాత్ర‌

Leave A Reply

Your Email Id will not be published!