Varahi Yatra : మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఈనెల 21 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత వారాహి యాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ ఆదివారం వెల్లడించింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపింది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు విడతలు వారాహి యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక తాజాగా చేపట్టబోయే 4వ విడత యాత్ర కృష్ణా జిల్లా నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ పేర్కొంది. 4 నియోజకవర్గాలలో మొత్తం 5 రోజుల పాటు కొనసాగనుందని తెలిపింది.
Varahi Yatra Will Start Again
పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర(Varahi Yatra) కృష్ణా జిల్లా లోని అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం, కైకలూరు లో కొనసాగుతుందని జనసేన పార్టీ స్పష్టం చేసింది. వారాహి యాత్ర సందర్భంగా పార్టీకి చెందిన జిల్లాల బాధ్యులు ఏర్పాట్లు చేయాలని కోరింది.
ఇదిలా ఉండగా ఏపీలో రాజకీయాలు కొత్త రూపును సంతరించుకున్నాయి. రాబోయే ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించు కున్నాయని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాన్ ప్రకటించారు. దీంతో వారాహి యాత్రకు టీడీపీ శ్రేణులు ఏ మేరకు సహకరించ నున్నాయో తేలనుంది.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు
