Pawan Kalyan : జగన్ ను తరిమి కొడదాం – పవన్
ఈగోలు వద్దు కలిసి పని చేద్దాం
Pawan Kalyan : మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ సర్కార్ ను, ఆ పార్టీ చీఫ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు జగన్ అని ఆరోపించారు.
Pawan Kalyan Slams YSRCP Govt
ఇక వైసీపీకి కాలం చెల్లిందని, ఆ పార్టీ ఉండేది కేవలం ఆరు నెలలు మాత్రమేనని జోష్యం చెప్పారు పవన్ కళ్యాణ్. అధికారులు వైసీపీ కార్యకర్తల్లాగా మారి పోయారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలతో ఈగోలకు పోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.
టీడీపీ, జనసేన(Janasena) కలిసికట్టుగా పని చేస్తేనే వైసీపీని తరిమి కొట్టగలమన్నారు. టీడీపీతో సమన్వయ కమిటీ చీఫ్ గా నాదెండ్ల మనోహర్ వ్యవహరిస్తారని ప్రకటించారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
రాష్ట్ర విభజన సమయంలోనే జగన్ రెడ్డి కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్.
విడతల వారీగా రాజీనామాలతో అభివృద్ది జరగకుండా అడ్డుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పేటీఎం కుట్రలను జన సైనికులు బలంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో రాచరికం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. వలసలు మరింత పెరిగాయన్నారు. పవర్ షేరింగ్ వదిలేయండి మనమంతా కలిసి వైసీపీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
Also Read : Pawan Kalyan : జగన్ ను తరిమి కొడదాం – పవన్
