Varudu Kalyani : చంద్రబాబు నియంత..గజదొంగ
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్
Varudu Kalyani : విశాఖపట్టణం – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మించిన నియంత లేడని, ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఏపీ చీఫ్ , ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Varudu Kalyani). ఆమె మీడియాతో మాట్లాడారు.
45 ఏళ్ల జీవిత కాలమంతా ప్రజా ధనాన్ని లూటీ చేయడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఈడీ, ఐటీ, సీఐడీ పక్కా ఆధారాలతో చంద్రాబు నాయుడు అక్రమాలకు పాల్పడ్డాడని ఆధారాలతో సహా చెబుతున్నా ఇంకా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి నీతి వాక్యాలు వళ్లిస్తుండడం దారుణమన్నారు.
Varudu Kalyani Serious Comments on Chandrababu
అందుకే ఏపీ ప్రజలు ఈ అవినీతి కింగ్ పిన్ ను సాగనంపారని , కోలుకోలేని షాక్ ఇచ్చారని స్పష్టం చేశారు. ఇవాళ దేశంలో అత్యంత కరప్షన్ లో టాప్ ఎవరంటే చంద్రబాబు నాయుడి పేరే గూగుల్ లో వస్తుందన్నారు వరుదు కళ్యాణి.
టీడీపీ మాయ మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరన్నారు. బాబు అరెస్ట్ అయినా ఏ ఒక్కరూ బయటకు రాలేదని ఆ విషయం గుర్తిస్తే మంచిదన్నారు. బాబు దత్త పుత్రుడు ఎక్కడున్నాడో చెప్పాలని అన్నారు ఎమ్మెల్సీ.
అవినీతి, అక్రమాలకు పాల్పడితే జైలులో ఉంచక హారతి పడతారా అని ప్రశ్నించారు వరుదు కళ్యాణి. తండ్రి జైల్లో ఉంటే కొడుకు లోకేష్ ఢిల్లీకి పారి పోయాడని ఎద్దేవా చేశారు.
Also Read : Tirumala Hundi : భారీగా శ్రీవారి హుండీ ఆదాయం