Revanth Reddy : హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పై పోటీకి సై
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : న్యూఢిల్లీ – టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
Revanth Reddy Slams BRS Govt
సీఈసీ రాజీవ్ కుమార్ ను కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). రాష్ట్రంలో ప్రభుత్వం రిటైర్డ్ ఆఫీసర్స్ ప్రైవేట్ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలను పనిగట్టుకుని వేధింపులకు గురి చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
వెంటనే రిటైర్డ్ ఆఫీసర్స్ ను బదిలీ చేయాలని లేదా వారిని తొలగించాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల నిధులను తాము అడ్డుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. నగదు డబ్బులను నవంబర్ 2 లోగా బదిలీ చేయాలని కోరారు.
కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోయిందని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం కొత్త నాటకానికి తెర లేపిందన్నారు. డ్యాం సేఫ్టీ ఆఫీసర్స్ ఇచ్చిన నివేదికను కేంద్రం ఎందుకు బయట పెట్టడం లేదంటూ ప్రశ్నించారు.
ఇక హైకమాండ్ ఆదేశిస్తే తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Also Read : Chandra Babu Case : చంద్రబాబు కేసుపై కోర్టు విచారణ
