Kolusu Parthasarathi : జగనన్న సురక్ష ఆరోగ్యానికి శ్రీరామ రక్ష
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి
Kolusu Parthasarathi : పెనమలూరు – మాజీ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, సీఎం జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని చెప్పారు కొలుసు పార్థసారథి.
Kolusu Parthasarathi Comment
నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేకూర్చిన లబ్దిని వివరించారు. పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం వైసీపీ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోందని స్పష్టం చేశారు కొలుసు పార్థ సారథి.
ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని అన్నారు. ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీలోనే పెనమలూరు ఆదర్శ ప్రాయమైన నియోకవర్గంగా తీర్చి దిద్దుతానని చెప్పారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి.
ఇదిలా ఉండగా నియోజకవర్గ పరిధిలోని తాడి గడప సచివాలయం 4 పరిధిలో ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం ముందు చూపుతో చేపట్టిన ఈ స్కీం దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలుస్తుందనడంలో సందేహం లేదన్నారు.
సంపన్న వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలను పేద, గ్రామీణ ప్రజల చెంతకు తీసుకు వచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. టెస్టింగ్ చేయడం, అందుబాటులోకి వైద్యులను తీసుకు రావడం, నాణ్యమైన మందులను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు.
జగనన్న సురక్ష ఆరోగ్య పథకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathi). కంకిపాడులో 50 పడకల ఆస్పత్రి నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇక ఉ్యూరులో 50 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉందని చెప్పారు కొలుసు పార్థసారథి.
ఇక పెనమలూరు నియోజవర్గంలోని పోరంకి, యనమలకుదురు గ్రామాలలో మరో రెండు ఆస్పత్రలును నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆరోగ్య సురక్ష ద్వారా 1 కోటి 67 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఇంత మంచి ఆరోగ్య స్కీంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Also Read : Mohammad Azharuddin : ముందస్తు బెయిల్ కోసం అజ్జూ
