Mudragada Padmanabha Reddy: ముద్రగడ పద్మనాభరెడ్డికి అస్వస్థత ! కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స !

ముద్రగడ పద్మనాభరెడ్డికి అస్వస్థత ! కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స !

Mudragada Padmanabha Reddy : కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను కాకినాడకు తరలించారు. కాకినాడ అహోబిలం ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు. అనంతరం శనివారం రాత్రి 10.30 గంటల సమ­యంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికి­త్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తు­తం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Mudragada Padmanabha Reddy – ఆ ప్రచారాన్ని నమ్మొద్దు

ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న కథనాలను ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు ఖండించారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. మీడియా, సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన.

Also Read : MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌

Leave A Reply

Your Email Id will not be published!