Ganta Srinivasarao: జగన్‌ మానసిక పరిస్థితిపై అనుమానం ఉంది – గంటా శ్రీనివాసరావు

జగన్‌ మానసిక పరిస్థితిపై అనుమానం ఉంది - గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasarao : రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి వైఎస్‌ జగన్‌ ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) అన్నారు. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమవడంతో ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లను జగన్‌ బెదిరిస్తున్నారని… ఆయన మానసిక పరిస్థితిపై అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడారు.

Ganta Srinivasarao Shocking Commens on Ex CM YS Jagan

‘‘అనంతపురంలో నిర్వహించిన సూపర్‌ సిక్స్‌… సూపర్‌హిట్‌ సభ విజయవంతమైంది. చెప్పిన మాట చేసి చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పేందుకు ఆ సభ ఉదాహరణ. జగన్‌ తీరు దారుణంగా ఉంది. సీఎం, హోం, వ్యవసాయ మంత్రులపై ఇష్టారీతిన ఆయన మాట్లాడారు. జగన్‌ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 18 సీట్లు వస్తే తప్ప ఆ హోదా రాదు. వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావు. వైకాపా హయాంలో నర్సీపట్నంలో వైద్యకళాశాలను కేవలం 8 శాతమే పూర్తిచేశారు. పార్టీ కార్యాలయాలు తప్ప జగన్‌ ఇంకేమీ నిర్మించలేదు’’

‘‘రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్‌ కట్టారు. ఆ ఖర్చు మెడికల్‌ కాలేజీలపై పెట్టి ఉంటే అవి పూర్తయ్యేవి. వైకాపా ఐదేళ్ల పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. గత ప్రభుత్వం కంటే అధిక మొత్తంలో పింఛను అందిస్తున్నాం. దివ్యాంగులకు పింఛను పెంచి ఇస్తున్నాం. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. నేపాల్‌లో తెలుగువాళ్లు చిక్కుకుంటే మంత్రి నారా లోకేశ్‌ నిరంతరం పర్యవేక్షించి వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు’’ అని గంటా శ్రీనివాసరావు అన్నారు.

Also Read : Jubilee Hills: బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత ?

Leave A Reply

Your Email Id will not be published!