ఢిల్లీ : ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్యసభలో ఆప్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ స్పీకర్ కు లేఖ ఇవ్వడం పట్ల తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు. తాను ఓడి పోలేదని, అయితే నోరు మూయించే ప్రయత్నం చేయడం పట్ల బాధను వ్యక్తం చేయడం చర్చకు దారితీసేలా చేసింది. రాఘవ్ చద్దా గత కొన్ని రోజుల నుంచి పార్లమెంట్ సాక్షిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. దేశం నుంచి ఎందరో ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏనాడూ సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించిన పాపాన పోలేదు. దీంతో ఒక్కసారిగా రాఘవ్ చద్దా పేరు మారుమ్రోగి పోయింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తను ట్రెండింగ్ లో కొనసాగుతున్నాడు.
రాఘవ్ చద్దా లేవదీసిన ప్రశ్నలు సామాన్యులకు ఆయుధాలుగా మారాయి. ఈ తరుణంలో ఆప్ పార్టీ తన పట్ల అనుసరించిన విధానంపై భగ్గుమంటున్నారు నెటిజన్లు. ఇది కేవలం రాఘవ్ చద్దాకు వస్తున్న జనాదరణను చూసి తట్టుకోలేకనే ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాజ్యసభ పదవి తొలగింపు తర్వాత ఆప్‌పై విమర్శలు గుప్పించారు ఎంపీ. పార్లమెంటులో తాను మాట్లాడకుండా తన సొంత పార్టీయే అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. నాకు అవకాశం దొరికినప్పుడల్లా, తరచుగా పట్టించుకోని అంశాలతో సహా, ప్రజలకు సంబంధించిన సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతాను. కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడటం నేరమా? నేను ఏదైనా నేరం చేశానా?ష అని నిలదీశారు.
