రైతుల‌కు మెరుగైన భారీ ప‌రిహారం : సీఎం

మెరుగైన ప్యాకేజ్ ఇస్తున్నామ‌న్న చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గార్లదిన్నె మండలం కణంపల్లిలో ఈరోజు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డితో క‌లిసి పార్క్ ఏర్పాటు చేయడం కోసం సేకరించిన భూమి పరిహార సంబంధించి చెక్కులు అంద‌జేశారు. మొత్తం భూమి142.96 ఎకరాలు అయితే అందులో 22 ఎకరాలకు సంబంధించి దాదాపుగా రూ. 4.5 కోట్ల పరిహారం రైతులకు అందించడం ఆనందంగా ఉంద‌న్నారు. యువతకు ఉపాధి కల్పించడం కోసం చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ఏపీఐఐసీ ఆమోదం పొందిన ఎంఎస్ఎంఈ పార్కు ను ద‌శ‌ల వారీగా అభివృద్ది చేస్తామ‌న్నారు సీఎం. ఒక ఇండస్ట్రియల్ కారిడారుగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నామ‌న్నారు.

అదులో భాగంగా ఈరోజు కొంతమంది రైతులు తాము ఇచ్చినటువంటి భూమికి పరిహారం ఇవ్వడం జరిగింద‌న్నారు. ఈ ప్రాంతం అనంతపురానికి సమీపంలో ఉండటం, అలాగే బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి (NH-44)కు ఆనుకుని ఉండటం వల్ల పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలంగా ఉంటుంద‌న్నారు. 2018 లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంకురార్పణ చేయడం జరిగిందన్నారు. ఇక్కడ MSME పార్క్ ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయ‌ని చెప్పారు. ఇంతేకాకుండా ఈ భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ లేదా ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయన్నారు. భూమి సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన వారికి ఎక్స్-గ్రేషియా చెల్లింపులు చేసి, భౌతిక స్వాధీనం అప్పగించాలని ఆదేశించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.

Leave A Reply

Your Email Id will not be published!