మ‌హిళా రేప్ కేసులో లొంగి పోయిన సీఐ మ‌ల్ల‌య్య‌

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన రేప్ కేసు

అమ‌రావ‌తి : ఏపీలో సంచ‌ల‌నం క‌లిగించింది సీఐ చిన్న‌ మ‌ల్ల‌య్య రాస‌లీల వ్య‌వ‌హారం. త‌న అధికారాన్ని అడ్డం పెట్టుకుని మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేసి అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వినుకొండలో మహిళ పై బలత్కారం చేసినట్లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అంతే కాదు త‌ను పనిచేసిన ప్రతిచోట ఇదేరకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు మ‌ల్ల‌య్య‌. ఎస్సైగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా బచ్చన్నపేట పీఎస్ లో పనిచేసిన చిన మల్లయ్య. అక్కడ కూడా పలువురు మహిళలను బెదిరించి లోబరుచున్నట్లు స్థానికులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇటీవల కేసుల నేపథ్యంలో అరెస్ట్ భయంతో పరారయ్యాడు చిన మ‌ల్ల‌య్య‌. త‌న‌ను ప‌ట్టుకునేందుకు పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. ఎక్క‌డ ఉన్నా త‌న‌ను ప‌ట్టుకుంటార‌ని గ్ర‌హించాడు నిందితుడు. చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేక , త‌ప్పించు కునేందుకు దారులు మూసుకు పోవ‌డంతో చివ‌ర‌కు నిన్న రాత్రి లొంగి పోయేందుకు వినుకొండ పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చాడు. బాధిత మ‌హిళ‌లు, కుటుంబాలు త‌న‌పై దాడికి పాల్ప‌డే ఛాన్స్ ఉంద‌ని భ‌య‌ప‌డ్డాడు. ఇవాళ త‌న అరెస్ట్ పై మీడియా స‌మావేశంలో కీల‌క వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉండ‌గా ఇప్పటికే చిన మల్లయ్యను సర్వీసు నుండి పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
త‌న‌ను స‌ర్వీస్ నుంచి పూర్తిగా తొల‌గించ‌డంతో మాజీ సీఐ చిన మ‌ల్ల‌య్య‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది.

Leave A Reply

Your Email Id will not be published!