చెన్నై : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు టీవీకే అధినేత, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన ఇప్పటికే ప్రజల సీఎంగా పేరు పొందాడు. ఆయన పోరాడకుండా ఓటమిని అంగీకరించరు. నార్వేలో జరిగిన చెస్ టోర్నీ లో విజేతగా నిలిచాడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. ఈ సందర్బంగా తమ ప్రాంతానికి గర్వ కారణంగా నిలిచిన తనను, తల్లిదండ్రులను పిలిపించుకున్నాడు. ప్రభుత్వం తరపున సన్మానం చేశాడు. ఆపై గ్రాండ్ మాస్టర్ కు రూ. 50 లక్షల చెక్కును బహుమతిగా అందించాడు. ఇది తన స్పెషాలిటీ. తనతో చెస్ కూడా ఆడాడు. ఓడి పోయినా ఆడటం మానలేదు సీఎం.
కానీ చాలా మందిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ప్రజల ముఖ్యమంత్రి విజయ్ ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగ క్రీడాకారులలో ఒకరితో దాదాపు 15 నిమిషాల పాటు హోరాహోరీగా తలపడ్డారు. ఆ సమావేశం తర్వాత ప్రజ్ఞానంద చెప్పిన మాటలు మరింతగా ఆకట్టుకున్నాయి. విజయ్ ఎంత బాగా ఆడారో చూసి తాను ఆశ్చర్య పోయానని, అలాగే ఆ సమావేశం అంతటా ఆయన చూపిన ప్రోత్సాహం మరిచి పోలేనని పేర్కొన్నాడు. ముఖ్యమంత్రి విజయ్ తనకు తీరిక సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతో చదరంగం ఆడుతానని వినయంగా బదులిచ్చారు. క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరోసారి స్పష్టం చేస్తుంది.
యువతను క్రీడలు, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన పోటీతత్వం వైపు ప్రోత్సహించడం ద్వారా వారిని మాదకద్రవ్యాలు, హానికరమైన అలవాట్ల నుండి దూరం చేయాలని జోసెఫ్ విజయ్ పదేపదే చెబుతుంటారు. ఆయన దృష్టి కేవలం ఛాంపియన్‌లను తయారు చేయడం మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం, బాధ్యత గల యువతరాన్ని సృష్టించాలన్నది తన లక్ష్యం. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా తమిళనాడు ఇప్పటికే భారతదేశంలోని అత్యంత బలమైన చెస్ కేంద్రాలలో ఒకటిగా మారింది . విజయ్ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ధి, ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది.
చెన్నైలో ప్రత్యేకంగా “హోమ్ ఆఫ్ చెస్” అకాడమీని స్థాపించడం ఆ నిబద్ధతకు మరో ఉదాహరణ. ఉన్నత స్థాయి క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందించడం నుండి భవిష్యత్ ఛాంపియన్‌లకు అవకాశాలు కల్పించడం వరకు, ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది.
