రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.1.72 కోట్లు : డిప్యూటీ సీఎం

కాంట్రాక్టు ఉద్యోగుల‌కు రూ. 45.76 ల‌క్ష‌లు ఇస్తామ‌న్న ప‌వ‌న్

విశాఖ‌ప‌ట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన మృతుల కుటుంబాలను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఘటనా స్థలిని సందర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం. క్షతగాత్రులకు రూ. 10 లక్షలు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌న్నారు. చికిత్సకి అయ్యే ఖర్చు మొత్తం ఆర్.ఐ.ఎన్.ఎల్. భరిస్తుంద‌న్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. పదవీ విరమణ ప్రయోజనాల కింద రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 1.72 కోట్లు. కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 45.75 లక్షల అందుతాయని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల మాదిరి మృతుల పిల్లల చదువులు కొనసాగించేందుకు సహకారం అందిస్తామ‌న్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై విచారణకు బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి త్రీ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేశామ‌ని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. విచారణ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహకారం అందిస్తాం అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకే తిక పరమైన ఇబ్బందులు తెలుసు కునేందుకు త్వరలో కార్మిక సంఘాలతో సమావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకూడదన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల మాదిరి మృతుల పిల్లల చదువులు కొనసాగించేందుకు సహకారం ఇస్తామ‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!