కాంగ్రెస్ పార్టీలో టీఎంసీ విలీనం కానుందా..?

దేశ రాజ‌కీయాల‌లో కీల‌క ప‌రిణామాలు

న్యూఢిల్లీ : దేశ రాజ‌కీయాల‌లో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సుదీర్ఘ కాలం పాటు ప‌శ్చిమ బెంగాల్ లో పాల‌న సాగిస్తూ వ‌చ్చిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఉన్న‌ట్టుండి ఈ ఏడాది జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో దారుణ‌మైన ఓట‌మిని చ‌విచూసింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ అత్య‌ధిక సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. ఒక‌ప్పుడు మాజీ సీఎం , టీఎంసీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీకి అనుంగు అనుచ‌రుడిగా గుర్తింపు పొందిన సువేందు అధికారి ఇప్పుడు ఏకంగా త‌న క‌ళ్ల ముందే ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు. మ‌రో వైపు సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన టీఎంసీని చీల్చ‌డంలో కేంద్ర మంత్రి , ట్ర‌బుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ షా స‌క్సెస్ అయ్యారు. దీంతో బీజేపీ వ్యూహాత్మ‌క చ‌ర్య‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోంది దీదీ. నిన్న‌టి దాకా ఉప్పు నిప్పు లాగా ఉన్న కాంగ్రెస్ , టీఎంసీలు ఇప్పుడు ఉన్న‌ట్టుండి ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. వాస్త‌వానికి రాజ‌కీయాల‌లో శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న‌ది వాస్త‌వం.

ఇక దేశ రాజ‌కీయాలలో కీల‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మమతా బెనర్జీని జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించాలని సోనియా గాంధీజీ ప్రతిపాదించారు. అభిషేక్ బెనర్జీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, బెంగాల్ కాంగ్రెస్ ముఖచిత్రంగా నియమించాలని ఆమె కోరారు….
మమతా బెనర్జీని రాజ్యసభ ఎంపీగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకురాలిగా చేయాలని అభిషేక్ బెనర్జీ ప్రతిపాదించారు .ఈరోజు, రాహుల్ గాంధీజీ, అభిషేక్ బెనర్జీ 10 జనపథ్‌లో 3.5 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మమతా బెనర్జీ జూన్ 8, 9 తేదీలలో సోనియా గాంధీని రెండుసార్లు కలిశారు.

Leave A Reply

Your Email Id will not be published!