హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ది మూవీ టీం తనను కలిసిన సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఆయన కథల గురించి ప్రస్తావించారు. గతంలో లాగా ఇప్పుడు కథలు చాలా స్పీడ్ గా చెప్పేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇదే సమయంలో తను పెద్ది లాంటి కథల గురించి కూడా ప్రస్తావించారు.ఇందుకు ఆయన మరోసారి దిగ్గజ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం గురించి గుర్తు చేసుకున్నారు. తను నాతో ఒకసారి మాట్లాడుతూ ఇలా ఆన్నారు. రుద్రవీణ, ఆపద్బాంధవుడు లాంటి చాలా నటన పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు చేసావు, ఇప్పుడు కమర్షియల్ వైపు వెళ్ళి పోతున్నావు అన్నారు.
బాలచందర్, కమల్-రజిని కలిపితే చిరంజీవి అన్నారు ఎస్పీబీ. నేను అలాంటి కంటెంట్ సినిమాలు వస్తే ఎందుకు చేయను? అంటూ ప్రశ్నించారు మెగాస్టార్. నాకు ఆ కెపాసిటీ ఉంది.. నాకు అలాంటి కథలు వస్తే చేస్తానని నమ్మకం ఉందన్నారు. దంగల్, చక్ దే లాంటి సినిమాలు చూసి.. నాకు కూడా ఇలాంటి కథలు వస్తే బాగుండు అనిపించిందని చెప్పారు. కానీ అలాంటి కథలు రావట్లేదంటూ వాపోయారు చిరంజీవి.తాజాగా కథల గురించి చిరంజీవి చేసిన కామెంట్స్ తెలుగు సినీ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం తనకు బాగా కలిసొచ్చిందని చెప్పక తప్పదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ గారూ మూవీ లో నటించాడు. ఇది తన సినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా నిలిచి పోయింది. ఏకంగా రూ. 300 కోట్లు దాటేసింది. ప్రస్తుతం మరో కొ్త మూవీ కోసం రెడీ అయ్యాడు చిరంజీవి. ఒక రకంగా చెప్పాలంలటే తన కొడుకు రామ్ చరణ్ తో పోటీ పడుతున్నాడు తండ్రి.
